November 21, 2019

సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ – కంటి వెలుగు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాదని సమాజం పట్ల బాధ్యత కూడా కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్నారని అందుకు ఉదాహరణే డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమమని కొనియాడారు. నెల్లూరు బివి నగర్ లో ఉన్న కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబుతో కలిసి గిరిధర్ రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అంధత్వ నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వివిధ దశల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు, ఆపరేషన్లు ప్రభుత్వమే ఉచితంగా నిర్వహిస్తుందని గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, నగర పాలక సంస్థ కమీషనర్ మూర్తి, వైద్యఆరోగ్య శాఖ అధికారిణి రాజ్యలక్ష్మి, విద్యాశాఖ అధికారి జనార్ధనాచార్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!