November 19, 2019

ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యా యత్నం

Clock Of Nellore ( Udayagiri ) – నెల్లూరుజిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయితే అక్కడే ఉన్న వారి బంధువులు ఆమెను వారించి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లో కెళ్తే… ఉదయగిరిలోని వెంగళరావునగర్ లో నివాసం ఉండే కూరపాటి పద్మ కుమారుడు సురేంద్ర వారి సమీప బంధువు కుమార్తె అయిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మూడు రోజుల క్రితం ఇంటి నుండి తీసుకెళ్లిపోయాడు. శనివారం వారిని పెద్దలు తీసుకొచ్చారు. మైనర్ అయిన తన కుమార్తెను తీసుకెళ్తావా అంటూ వారు ఉదయగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. విషయం తెలుసుకున్న సురేంద్ర తల్లి కూరపాటి పద్మ కూడా వారితోనే స్టేషన్ కు వెళ్లింది. సురేంద్రపై పోలీస్ ఫిర్యాదు ఇవ్వొద్దంటూ పద్మ స్టేషన్ బయట సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయితే ఆమె తాగే లోపే బందువులు ఆమె ప్రయత్నాన్ని ఆపి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాధమిక చికిత్స అందించి డిశ్ఛార్జ్ చేశారు. ఇరు కుటుంబాల వారిని పెద్దలు పిలిపించి మాట్లాడుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!