November 21, 2019

విఆర్ విద్యా సంస్థలకు పూర్వ వైభవం తీసుకురండి – మంత్రి అనీల్ ను కోరిన పూర్వ విద్యార్ధులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ప్రతిష్ఠాత్మక విఆర్ విద్యా సంస్థల ప్రతిష్ఠ రోజు రోజుకూ మసకబారిపోతుందని దానికి పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ను కోరారు కళాశాల పూర్వ విద్యార్ధులు. గురువారం కళాశాల పూర్వ విద్యార్ధులు మలిరెడ్డి కోటారెడ్డి, కటారి అజయ్ కుమార్, గునపాటి తులసీరామిరెడ్డి తదితరులు నెల్లూరులో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు పాలక మండలిని రద్దు చేసి జాయింట్ కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమించారని మంత్రి దృష్ఠికి తీసుకెళ్లారు. విఆర్ కళాశాలకు పాలక మండలి ఎన్నికలను ఇంత వరకూ నిర్వహించలేదన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి నెలలు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఫలితంగా విఆర్ విద్యా సంస్థల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. అలాగే కళాశాల నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి అనీల్ దృష్ఠికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అనీల్… విఆర్ కళాశాల అంటే ఓ చరిత్ర అని అంటూ దాని అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 28వ తేదీనా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి కళాశాలను సందర్శిస్తానని పేర్కొన్నారు. దీనిపై పూర్వ విద్యార్ధులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!