November 19, 2019

పెన్నా బ్యారేజీ వద్ద సందర్శకులు సందడి – ఆకట్టుకుంటున్న పెన్నమ్మ నీటి సవ్వడి

Clock Of Nellore ( Nellore ) – సోమశిల జలాశయం నుండి పెన్నానదికి నీరు విడుదల చేయడంతో నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సందర్శకులతో సందడిగా మారింది. గత నాలుగు రోజులుగా సోమశిల జలాలు బ్యారేజీ మీదుగా పెన్నా ఆనకట్ట నుండి జాలువారుతా ప్రవహిస్తున్నాయి. చాలా కాలం తర్వాత పెన్నా సవ్వడితో కళకళలాడుతుండటంతో నగర వాసులు సాయం సంధ్య వేళ అక్కడకెళ్లి పెన్నా అందాలను తిలకించి పులకించిపోతున్నారు. నీటిలో సందడి చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. మరో వైపు పెన్నాలో మరో వారం రోజుల పాటూ ఇదే మాదిరిగా నీరు ప్రవహించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!