November 19, 2019

మంత్రి అనీల్ సహకారంతో విజయా డైరీని అభివృద్ధి చేస్తాం – సర్వసభ్య సమావేశంలో కొండ్రెడ్డి రంగారెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – జిల్లా మంత్రి డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ సహకారంతో నెల్లూరులోని విజయా డైరీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తెలియజేశారు. సోమవారం వెంకటేశ్వరపురంలోని విజయాడైరీ ఆవరణంలో పాలక మండలి సర్వసభ్య సమావేశం జరిగింది. కొండ్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లతో పాటూ మిగిలిన వారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లను పరిచయం చేశారు. అనంతరం రంగారెడ్డి మాట్లాడుతూ డైరీలో ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, ఉత్పత్తిని పెంచేందుకు పరికరాలను మార్చాల్సి ఉందని అన్నారు. నూతన పరికరాల కొనుగోలుకు సమావేశంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. డైరీ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తో చర్చించినట్లు తెలియజేశారు. మంత్రి ప్రాతినిధ్యం వహించే నెల్లూరుసిటీలోనే విజయా డైరీ ఉందని గుర్తు చేశారు. త్వరలోనే విజయా డైరీ అభివృద్ధికి శ్రీకారం చుడతామని రంగారెడ్డి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!