November 12, 2019

నెల్లూరుజిల్లాలోని ESI హాస్పిటల్స్ లో విజిలెన్స్ తనిఖీలు – అక్రమాలపై ఆరా

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వ్యాప్తంగా కార్మికుల ప్రభుత్వ భీమా డిస్పెన్సరీ ( ESI హాస్పిటల్స్ )ల్లో రీజనల్ విజిలెన్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంతో పాటూ సూళ్లూరుపేట, కావలి పట్టణాల్లో ఉన్న హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీ చేసి సోదాలు చేపట్టారు. ప్రధానంగా మందుల కొనుగోళ్లు, వాటి వినియోగానికి సంభందించిన రికార్డులను పరిశీలించారు. ఏవైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. 2014 -15, 2018-19 సంవత్సరాలకు గానూ చేపట్టిన మందుల కొనుగోళ్లు, వినియోగంపై తనిఖీలు చేపట్టామని అవకతవకలుంటే ఉన్నతాధికారులకు నివేదిస్తామని విజిలెన్స్ సిఐ మాణిక్యరావు తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!