November 21, 2019

వెంకటగిరి గుండా భారీగా గుట్కాల తరలింపు – ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Venkatagiri ) – పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుండి నెల్లూరుజిల్లాలోని వెంకటగిరికి నిషేదిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50లక్షలు విలువజేసే గుట్కా ఉత్పత్తులను, ఓ వాహనాన్ని సీజ్ చేశారు. నెల్లూరు చంద్రబాబు నగర్ కు చెందిన షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి తమిళనాడుకు వెళ్లి గుట్కాలను కొనుగోలు చేశాడు. 50 వేలు విలువజేసే గుట్కాలను కొనుగోలు చేసి మారుతీ సుజుకి ట్రక్ ద్వారా తమిళనాడుకు చెందిన సింబని బక్కన్ అనే వ్యక్తితో కలిసి చిత్తూరుజిల్లా, నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి మీదుగా తరలించే ప్రయత్నం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న వెంకటగిరి ఎస్సై ఎమ్.వి. రాజేష్ తన సిబ్బందితో కలిసి రాపూరు క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో గుట్కాల బండారం బట్టబయలైంది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని గుట్కాలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం వెంకటగిరి సిఐ అన్వర్ బాషా తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. గుట్కాలను తరలిస్తున్న ఇద్దర్నీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!