November 22, 2019

రైతు భరోసా సభకు తరలిరండి – పిలుపునిచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 15వ తేదీనా నెల్లూరులో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా సభకు వెంకటగిరి నియోజకవర్గం నుండి రైతులు, అభిమానులు, నేతలు భారీగా తరలి రావాలని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని వారి నివాసంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారని ఈ నేపద్యంలో సభను విజయవంతం చేయాలన్నారు. రైతులు, కార్యకర్తల తరలింపు విషయాల్లో నేతలు శ్రద్ధ చూపాలని ఆనం వారికి సూచించారు. ఈ సమావేశంలో వెంకటగిరి రాజ కుటుంబీకులు సర్వజ్ఞ కుమార యాచేంద్ర, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద, ఆర్టీసీ మాజీ ఛైర్మైన్ చెలికం శంకర్ రెడ్డి, నేతలు కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆనం రామనారాయణరెడ్డి రైతు భరోసా సభ జరిగే విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!