November 12, 2019

వెంకటగిరిలో ముంబై హైకోర్టు న్యాయమూర్తి – మర్యాద పూర్యకంగా కలిసిన ఆనం

Clock Of Nellore ( Venkatagiri ) – మహారాష్ట్ర రాజధాని ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామ శేషాద్రి నాయుద్రి మంగళవారం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి విచ్చేశారు. తెలుగుగంగ అతిధి గృహంలో బసచేసిన ఆయన్ను మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామ నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లాకు చెందిన జస్టిస్ శేషాద్రి నాయుడు జిల్లాకే గర్వకారణమని ఆనం అన్నారు. తరువాత పలు అంశాలపై సుమారు గంట పాటూ ఇద్దరూ చర్చించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!