November 12, 2019

అభివృద్ధే లక్ష్యం – రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనం

Clock Of Nellore ( Rapur ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాపూరు మండలం, బొజ్జనపల్లి రోడ్డు పాయింట్ నుండి వీరాయపాళెంకు 3.57 కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డు పనులకు ఆనం శంఖుస్థాపన చేశారు. అలాగే అదే మండలంలోని మద్దెల మడుగు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. పెండింగ్ పనులపై ఇప్పటికే నివేదిక తయారు చేశామని విడతల వారీగా వాటికి నిధులు తీసుకొచ్చి అన్నీ పనులను సకారంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!