January 23, 2020

ఖాకీ ముసుగులో అక్రమాలపై ఎస్పీ భూస్కర్ భూషణ్ సీరియర్ – ఏఎస్సై సస్పెన్షన్

Clock Of Nellore ( Nellore ) – జాతీయ రహదారిపై తనిఖీల పేరుతో లారీలను ఆపి డ్రైవర్ల వద్ద నుండి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న ఓ పోలీస్ పై నెల్లూరుజిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కొరఢా జుళిపంచారు. ఆయన్ను విధులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న బి. రవీంద్ర వెంకటాచలం టోల్ ప్లాజా రాత్రిళ్లు లారీలను ఆపి డ్రైవర్ల వద్ద నుండి నగదు వసూలు చేస్తున్నట్లు ఎస్పీకి సమాచారం అందింది. దీనిపై అంతర్గతంగా విచారణ చేయించగా అది నిజమని నిర్ధారణ అయ్యింది. దీంతో సోమవారం ఏఎస్సై రవీంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!