November 16, 2019

నెల్లూరుజిల్లాలో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య – కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు

Clock Of Nellore ( Kota ) – నెల్లూరుజిల్లాలోని వాకాడులో ఉన్న ఆంధ్రా బ్యాంకు మేనేజర్ వెంకట రామారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. తిరుపతికి చెందిన వెంకట రామారావుకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 55 ఏళ్ల వయస్సున్న రామారావు వాకాడు మేనేజర్ గా బదిలీ కావడంతో కోట మండలం, విద్యానగర్ లో అద్దె నివాసంలో ఉంటున్నారు. ఇటీవల భార్య స్వస్థలం తిరుపతికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఏమైందో ఏమో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. మధ్యాహ్నం తర్వాత కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!