November 12, 2019

కోట సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం – శరీరమంతా ఉప్పుతో చిధ్రం

Clock Of Nellore ( Kota ) – నెల్లూరుజిల్లా కోట సముద్ర తీరంలో గురువారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. కొత్తపట్నం పంచాయితీ పరిధిలోని గున్నంపడియ గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి కొట్టుకురాగా స్థానికులు విఆర్వో జ్యోతిర్మయికి సమాచారం అందించారు. విఆర్వో సమాచారంతో కోట ఎస్సై మహేంద్ర నాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని శరీరం ఎముకల గూడుగా మారిపోయి ఉంది. ఒంటిపై ఖాకీ చొక్కా మాత్రమే ఉంది. శరీరమంతా ఉప్పు పట్టి తెల్లగా ఉంది. అక్కడక్కడా ఎముకలు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని బట్టి చూస్తుంటే 35 నుండి 40 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి సమాచారమందించి ఇటీవల మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. మృతుడు ధరించి ఉన్న ఖాకీ చొక్కాను బట్టి అతను ఆటో డ్రైవర్ అయి ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ఎస్సై మహేంద్ర నాయక్ కేసు నమోదు చేసి మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!