November 16, 2019

ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్ట్ – యువకులిద్దరూ బిట్రగుంట వాసులే

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని కావలి, గూడూరు పట్టణాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డ ఇద్దరు యువకులను నెల్లూరులోని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన మల్లి సాయి కృష్ణ, కుంచాల అవినాష్ అనే ఇద్దరు యువకులు ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీనా కావలి పట్టణంలో స్కూటీ పై వెళుతున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లి పరారయ్యారు. అలాగే అదే రోజు గూడూరు పట్టణంలో మరో మహిళ మెడలోని బంగారు దండను కూడా లాక్కెళ్లి పరారయ్యారు. ఈ రెండు చోరీలపై కేసులు నమోదు చేసిన స్థానిక పోలీసులు వాటి వివరాలను సిసిఎస్ విభాగానికి బదిలీ చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన సిసిఎస్ పోలీసులు మంగళవారం ఉదయం ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి చోరీ చేసిన 2లక్షలు విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నెల్లూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సిఐ బాజీ జాన్ సైదా విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ ఇద్దర్నీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఇద్దరి నేరస్తుల్లో ఒకరైన మల్లి సాయికృష్ణ గతంలో కూడా పలు చోరీ కేసుల్లో ముద్దాయి అని వెల్లడించారు. రెండు సార్లు జైలు వెళ్లి వచ్చి ఉన్నాడని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!