November 22, 2019

చేపల చెరువులో “రాజకీయ” విషం – లక్షన్నర విలువైన చేపలు మృత్యువాత

Clock Of Nellore ( Muthukur ) – నెల్లూరుజిల్లాలోని ముత్తుకూరు మండలంలో రాజకీయ విషం చిమ్మింది. ఓ వ్యక్తికి చెందిన చేపల చెరువులో కొందరు విషం కలపడంతో లక్షన్నర విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన వేల్పుల దేవకీ నందన అనే వ్యక్తికి రెండెకరాల చేపల చెరువు ఉంది. అందులో గత కొన్నేళ్ల నుండి చేపల సాగు చేపడుతున్నారు. ఎప్పటి లాగానే ఈసారి కూడా సాగు మొదలెట్టారు. బుధవారం ఉదయం అక్కడకు వెళ్లి చూసేసరికి చేపలన్నీ నీటిపై తేలి చనిపోయి ఉన్నాయి. పరిశీలించగా విష ప్రయోగం జరిగినట్లు తేలింది. దీంతో వారి సమీప బంధువులైన వేల్పుల రామకృష్ణ, మణికృష్ణ అనే ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తాను వైసీపికి మద్దతు పలికానని కక్ష్య కట్టిన రామకృష్ణ, మణికృష్ణలు తన చేపల చెరువులో విషం కలిపారని పోలీసులకు తెలియజేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!