November 19, 2019

నాయుడుపేటలో రైలు ప్రమాదం – వ్యక్తి మృతి

Clock Of Nellore ( NaiduPeta ) – నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం బిరదవాడ సమీపంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం స్థానికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతని వయస్సు 25 నుండి 30 ఏళ్ల లోపు ఉంటుందని అంచనా వేశారు. బ్లూ బనియన్ పైన తెల్ల చొక్కా, కాఫీ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడికి చేయి, కుడివైపు కాలు విరిగి ఉంది. పరిస్థితిని బట్టి చూస్తుంటే కదిలే రైల్లో నుండి జారీ పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాధమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!