November 12, 2019

ఆలయాల్లో 16 చోరీలు – ఇద్దర్ని అరెస్ట్ చేసిన కృష్ణపట్నం పోలీసులు

Clock Of Nellore ( Muthukur ) – నెల్లూరుజిల్లాలోని కృష్ణపట్నంతో పాటూ వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు, దర్గాలలో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణపట్నం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నెల్లూరు బోడిగాడితోటకు చెందిన మల్లిక శీనయ్య, విడవలూరు మండలం, రామతీర్ధంకు చెందిన మానికల నాగరాజు అనే ఇద్దరు యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దొంగల అవతారమెత్తారు. ముత్తుకూరు, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట, విడవలూరు, సంగం, కొడవలూరు, ఆత్మకూరు, కావలి, పొదలకూరు, ఏఎస్ పేట, సూళ్లూరుపేట, పెళ్లకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆలయాలు, దర్గాలలో చోరీలకు పాల్పడ్డారు. తాజాగా గత నెల 11వ తేదీనా తోటపల్లి గూడూరు మండలం, కొత్తకోడూరులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హుండీతో పాటూ బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టిపి గూడూరు పోలీసులు ఈ ఇద్దరిపై నిఘా ఉంచారు. చోరీకి పాల్పడింది వీరేనని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకుని విచారించగా జిల్లాలో మొత్తం 16 చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. 16 కేసుల్లో చోరీ చేసిన 2లక్షల విలువైన బంగారు సరుడు, కాసులు, తాళిబొట్టు, గుండ్లు మరియు వెండి వస్తువులను రికవరీ చేశారు. నెల్లూరు రూరల్ డిఎస్పీ కేవి రాఘవ రెడ్డి గురువారం సాయంత్రం ముత్తుకూరులో విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో కృష్ణపట్నం సిఐ ఎస్.కే. ఖాజావలి, టిపి గూడూరు ఎస్సై మనోజ్ కుమార్, ముత్తుకూరు ఎస్సై అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!