November 19, 2019

ఆదివారం నెల్లూరులో 2K రన్ – సేవ్ వాటర్ అంటూ లయన్స్ క్లబ్ నినాదం

Clock Of Nellore ( Nellore ) – లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులో 2K రన్ జరగనుంది. సేవ్ వాటర్ పేరుతో నిర్వహించనున్న ఈ 2K రన్ వివరాలను క్లబ్ అధ్యక్షులు లీలాధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రోజు రోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని భవిష్యత్తులో నీరు అందని ద్రాక్షగా మారనుందని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఆదివారం ఉదయం 6 గంటలకు నెల్లూరులోని సర్వోదయా కళాశాల ప్రాంగణం నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకూ 2K రన్ జరుగుతుందని లీలాధర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ సారధ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగర ప్రజలంతా విజయవంతం చేయాలని లీలాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో క్లబ్ కార్యదర్శి సుధీర్ బాబు, ట్రెజరర్ హర్షవర్ధన్, చెవుల యుగంధర్, కోట రమేష్ పాల్గొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం 2K రన్ Tషర్ట్ లను ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!