November 19, 2019

నెల్లూరులో ఏటిఎమ్ చోరీకి దొంగల యత్నం – అలారం మోగడంతో పలాయనం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని వేదాయపాళెం సెంటర్ లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటిఎంలో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించారు. బుధవారం తెల్లవారు జామున 2.51 నిముషాలకు నల్లదుస్తులు, ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఏటిఎం సెంటర్ లోకి చొరబడ్డారు. తమతో చెచ్చుకున్న ఇనుప పరికరాల ద్వారా ఏటిఎంను తెరిచే ప్రయత్నం చేశారు. స్క్రీన్ ఉండే ముందు భాగం తొలగించారు. తర్వాత నగదు ఉండే కింది భాగం తొలగించే ప్రయత్నం చేస్తుండగా అలారం మోగిెంది. దీంతో వారు హుటాహుటిన అక్కడి నుండి వెళ్లిపోయారు. ముంబైలోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంకు ఏటిఎంలు అనుసంధానంగా ఉంటాయి. ఈ నేపద్యంలో ఇక్కడి ఏటిఎంను అసహజ పద్దతిలో తెరుస్తుండటంతో ఆటోమేటిక్ మెసేజ్ ద్వారా ముంబై కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ముంబై సెక్యూరిటీ సిబ్బంది ఆన్ లైన్ ద్వారా ఇక్కడి అలారం మోగించారు. విషయం తెలుసుకున్న ఆంధ్రాబ్యాంక్ వేదాయపాళెం శాఖ అధికారులు ఉదయం ఏటిఎమ్ పరిశీలించారు. ఉండాల్సిన నగదు పదిలంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!