November 16, 2019

దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అరెస్ట్ – బంగారు గొలుసు స్వాధీనం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో పాత నేరస్తుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నెల్లూరు కోటమిట్ట ప్రాంతానికి చెందిన వేముల పాటి సురేష్ ఇటీవల ఓ ఇంట్లో బంగారు నక్లెస్ చోరీ చేశాడు. ఈ చోరీపై కేసు నమోదు చేసిన సంతపేట పోలీసులు శనివారం ముద్దాయి సురేష్ ను అరెస్ట్ చేసి చోరీ చేసిన 24 గ్రాముల నక్లెస్ ను రికవరీ చేశారు. దీనిపై సంతపేట సిఐ రాములు విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ వివరాలను తెలియజేశారు. చోరీ చేసిన నక్లెస్ విలువ 72వేల రూపాయలు ఉంటుందని చెప్పారు. నిందితుడు సురేష్ పై వేదాయపాళెం పోలీస్ స్టేషన్ లో ఓ కేసు ఉందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సై మహబూబ్ సుభాని కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!