November 22, 2019

ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యత – ప్రజలకు జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేసిన యశ్వంత్ సింగ్

Clock Of Nellore ( Nellore ) – పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క పౌరుడిపై ఉందని అందులో భాగంగా ప్లాస్టిక్ కవర్లను వాడటం పూర్తిగా నిలిపివేయాలని భారత్ యువశక్తి సంస్థ కన్వీనర్ యశ్వంత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరులోని రాజేంద్రనగర్ లో ఇంటింటికి జ్యూట్ బ్యాగ్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వల్ల ఇప్పటికే పర్యావరణం కలుషితమవుతుందని గుర్తు చేశారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినప్పుడు విడుదలయ్యే విష రసాయనాల వల్ల వన్య ప్రాణులు, జల చరాలు, మానవాళికి శ్వాసకోశ సంభందిత రోగాలు వస్తాయని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగులు, వస్తువుల వాడకం పూర్తిగా విడనాడాలని సూచించారు. దీనిపై తమ సంస్థ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా జ్యూట్ బ్యాగులు పంపిణీ చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుభాష్, కిరణ్, మోకీ, నాయబ్, సాయికృష్ణగిరి, సల్మాన్, వెంకటేష్, విజయ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!