November 12, 2019

అయ్యో… పాపం – పంబలేరులో శిశువు మృతదేహం

Clock Of Nellore ( Gudur ) – నవ మాసాలు మోసి కనిన మాతృత్వం ఆ కసాయి తల్లికి గుర్తు రాలేదేమో… రోజులు వయస్సుండే శిశువుని కాలువలో పడేసి తన కర్కశ్యాన్ని ప్రదర్శించింది. శిశువు బ్రతికున్నప్పుడు పడేసిందో… చనిపోయాక పడేసిందో తెలియదు కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ తల్లి మాతృత్వాన్ని మర్చి విషాన్ని కక్కింది. నెల్లూరుజిల్లా, గూడూరులో ఉన్న పంబలేరు వాగులో రోజుల వయస్సు ఉండే శిశువు మృతదేహాం శుక్రవారం ఉదయం కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎండకు శిశువు ముఖంతో పాటూ శరీరం నల్లగా మారిపోయి ఉంది. తెల్లవారు జామున శిశువును అక్కడ వదిలేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు శిశువు మృతదేహాన్ని అక్కడి నుండి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!