May 27, 2019

అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు విజయవంతంగా జరిగింది. అపోలో హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగాధిపతి, న్యూరాలజీ సీనియర్ కన్సల్ టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బింధుమీనన్ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ మినర్వాలో జరిగిన ఈ 5వ అంతర్జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా 400 మందికి పైగా ప్రతినిధులు, ముగ్గురు అంతర్జాతీయ, 25 మంది జాతీయ స్పీకర్లు మరియు ది ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సెక్రటరీ హాజరయ్యారు. ఈ సదస్సుకు అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ – ఛైర్ పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. సదస్సులో భాగంగా న్యూరాలజీకి సంభందించిన నూతన వైద్య విధానాలు, వ్యాధులపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బింధుమీనన్ మాట్లాడుతూ ఈ ఏడాడి 5వ అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులో నూతనంగా స్ట్రోక్ రిహాబిలిటేషన్, వర్క్ షాప్ నిర్వహించామని చెప్పారు.

న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న రోగులు త్వరితగతిన కోలుకునే విధంగా చికిత్స అందించే వైద్య సదుపాయాలు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం అపోలో వైద్యులు డాక్టర్ వి.షాలిని, డాక్టర్ అనితా పిళ్లై ల సహకారంతో అపోలో హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బింధుమీనన్ రూపొందించిన స్ట్రోక్ రిహాబిలిటేషన్ యాప్ ను అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ – ఛైర్ పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ వరుసగా రెండు సంవత్సరాలు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నుండి వరల్డ్ స్ట్రోక్ అవార్డు, ఇంటర్నేషనల్ లీగ్ ఎగైన్స్ట్ఎపిలెప్సీ వారి నుండి లీడర్ షిప్ అవార్డు ను సాధించిన బిందు మీనన్ ను ఆమె అభినందించారు.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్, యూనిట్ హెడ్ నవీన్,అపోలో కాలేజ్, చిత్తూరు ప్రిన్సిపాల్ డాక్టర్ M.S శ్రీధర్ మరియు APMC observer డాక్టర్ జి.ఆశోక్, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!