October 19, 2019

తమిళనాడులో మెడికల్‌ ATMలు..!

Clock Of Nellore ( Chennai ) – చెన్నైలోని ఆస్పత్రుల్లో ATM మిషన్లు కన్పిస్తున్నాయి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా. ATM లు అంతటా ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా. అయితే అవి మీరు అనుకుంటున్నట్లుగా డబ్బులు డ్రా చేసే ATM లు కాదు. ‘ఎనీ టైమ్ మనీ ఏటీఎంలు కావు.. ఎనీటైమ్‌ మెడిసిన్‌ ATM’లు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 23 మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటూ, మొత్తం 32 ప్రాంతాల్లో ఇలాంటి ATMలను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ యంత్రం ద్వారా TB, డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ వంటి 32 రకాల జబ్బులకు సంబంధించిన మందులు పొందవచ్చు. మెడికల్‌ షాపుల ముందు లైనులో నిలబడే పనిలేకుండా ఈ ATMల ద్వారా అత్యంత త్వరగా, తేలిగ్గా కావాల్సిన మందులను పొందేందుకు అవకాశముంది.

మనకు కావాల్సిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. మందులు కావాలనుకునే వారు ఈ కోడ్‌ని మిషన్ కు చూపించాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ని స్కాన్‌ చేసి ఎన్ని మందులు కావాలో అడుగుతుంది. ఎంత డబ్బు అవుతుందో చెబుతోంది. ఆ డబ్బు ఇవ్వగానే వెంటనే మందులు ఇచ్చేస్తుంది. ఈ ATM కు రూ.80లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం 32 మిషన్ ను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత మందులను కూడా ఈ ATMల ద్వారా పొందవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!