November 12, 2019

గూడూరులో ఘనంగా ముగిసిన జెండా పండుగ – కేరింతలు కొట్టిన యువతరం

Clock Of Nellore ( Gudur ) – నెల్లూరుజిల్లాలోని గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి వారి జెండా పండుగ ఘనంగా జరిగింది. మైసూరు తరువాత అంత స్థాయిలో జెండా పండుగ నిర్వహిస్తారని గూడూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతీ ఏడాది దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు జరిగే ఈ జెండా ఉత్సవానికి ప్రజలు లక్షలాదిగా తరలివస్తారు. తాజాగా శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారు జాము వరకూ ఈ జెండా పండుగ అట్టహాసంగా సాగింది. పండుగలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో భక్తులు పెద్ద పెద్ద మండపాలు నిర్మించి ఆంజనేయ స్వామి వారి జెండాలన స్థాపించారు. ఆయా ప్రాంతాలను విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. గూడూరులో ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలు, ఆంజనేయస్వామి జెండాలే దర్శనమిచ్చాయి.

శనివారం రాత్రి జెండాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఎక్కడికక్కడే జెండాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు అట్టహాసంగా ఊరేగింపును చేపట్టారు. బాణా సంచా పేలుళ్లు, డప్పులు, వాయిద్యాలు, డ్యాన్సులు, విచిత్ర వేషదారణలతో జెండాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఇకపోతే డీజేలు ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి. వేలాది మంది యువకులు డిజే మ్యూజిక్ కు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ గూడూరు వాసులంతా జెండా పండుగ కోసం విచ్చేశారు. జెండా పండుగ నేపద్యంలో గూడూరు పట్టణం ఇసుకేస్తే రాలనంతగా మారిపోయింది. మరో వైపు ఈ పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!