October 19, 2019

నెల్లూరులో ప్రారంభమైన అమ్మ వారి ఉత్సవాలు – పూజలు చేసిన గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కలశ పూజలతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులుకానీ, కమిటీ మెంబర్లు కానీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని. అలాగే పారిశుధ్యం, ట్రాఫిక్ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని సూసించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.వి.ఐ.పి.లు దర్శించేందుకు మధ్యాహ్నం 12 గంటలనుండి 1 గంటలోపు రాత్రి 8.30 గంటలనుండి 9.30 గంటల వరకు దర్శించుకోవాలని, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో విజయా డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్, సన్నపరెడ్డి పెంచల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!