November 19, 2019

తుఫానుగా మారిన వాయు గుండం – ఏపిపై ప్రభావం లేదన్న వాతావరణ శాఖ

Clock Of Nellore ( Central Desk ) – తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బుధవారం సాయంత్రం తుఫానుగా మారింది. నాలుగు రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం గంటల వ్యవధిలోనే వాయుగుండంగా తర్వాత తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర వాయువ్య దిశగా పయనించింది. తాజాగా తుఫానుగా మారింది. ప్రస్తుతం తుఫాను తూర్పు మధ్య బంగాళాఖాతం – అండమాన్ దీవుల మధ్య కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఒరిస్తా, పశ్చిమ బెంగాల్ వైపు వెళుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని స్పష్టం చేశారు. ఈ తుఫాను గురువారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రికి పెను తుఫానుగా మారుతుందని చెప్పారు. ఈనెల 10వ తేదీ వరకూ పెను తుఫానుగానే ఉండి 11వ తేదీ తీవ్రతను తగ్గించుకుంటుందని చెప్పారు. ఈనెల 11వ తేదీ వరకూ తుఫాను గమనాన్ని అధికారులు విడుదల చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!