November 22, 2019

నెల్లూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధా భారతికి 6 నెలలు జైలు శిక్ష

Clock Of Nellore ( Nellore Legal ) – నెల్లూరుజిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి బాలిరెడ్డి సుధా భారతికి నెల్లూరులోని 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 6 నెలలు జైలు శిక్షను విధించింది. ఆమెతో పాటూ భర్త వి.ఎస్. మురళీ కృష్ణారెడ్డికి కూడా 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు శుక్రవారం సాయంత్రం వెలువరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వి.ఎస్. మురళీ కృష్ణారెడ్డి ఆర్ధిక లావాదేవీల నేపద్యంలో నెల్లూరు బుజబుజనెల్లూరుకు చెందిన మంగల భాస్కర్, జరుగుమల్లి అరుణజ్యోతి అనే వారికి మొత్తం 5 చెక్కులను ఇచ్చారు. అలాగే మురళీ కృష్ణారెడ్డి భార్య అయిన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా భారతి కూడా ఆర్ధిక లావాలేవీలా నేపద్యంలో వారికి చెక్కులను అందజేశారు. చెక్కులు తీసుకున్న వారు వాటిని బ్యాంకుల్లో జమ చేయగా అవి చెల్లలేదు. దీంతో వారు నెల్లూరులోని 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం తీర్పును వెలువరించారు. మొత్తం 5కేసుల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా భారతితో పాటూ ఆమె భర్త మురళీ కృష్ణారెడ్డిలకు 6 నెలలు జైలు శిక్షను విధించారు. అలాగే చెక్కులకు సంభందించిన 27లక్షలా 17వేలా 800 రూపాయల మొత్తాన్ని సకాలంలో బాధితులకు చెల్లించాలని తీర్పు చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!