November 21, 2019

నెల్లూరులో కూలిన 3వ అంతస్తు సన్ సైడ్ – తప్పిన ప్రాణాపాయం – రెండు వాహనాలు ధ్వంసం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఆచారివీధిలో పురాతన భవనం మూడవ అంతస్తు సన్ సైడ్ కూలింది. ఇటీవల కురిసిన వర్షానికి నానిపోయిన ఆ సన్ సైడ్ మంగళవారం మధ్యాహ్నం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. సాధారణ రోజుల్లో అయితే అక్కడ వందల మంది ఉంటుంటారు. దసరా పండుగ కావడం, షాపులు మూతపడటంతో అక్కడ జనం లేదు. ఓ మోటార్ సైకిల్, సోడా బండి మాత్రమే ఉన్నాయి. సైన్ సైడ్ కూలే సమయంలో సోడా బండి వ్యక్తి దూరంగా ఉన్నారు. దీంతో అతనికి ఏమీ కాలేదు. సోడా బండితో పాటూ మోటార్ సైకిల్ స్వల్పంగా ధ్వంసమైనాయి. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపి నేత వేలూరు మహేష్ అక్కడికి చేరుకుని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచార మందించారు. అలాగే పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కార్పొరేషన్ అధికారులు కూలేందుకు సిద్దంగా ఉన్న మిగిలిన సన్ సైడ్ కూడా కూల్చివేశారు. ఎవ్వరికీ ఏమీ జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!