November 12, 2019

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు – హెచ్చరించిన నోడల్ అధికారిణి సదా భార్గవి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ సదా భార్గవి హెచ్చరించారు. జిల్లా నుండి ఇసుక అక్రమంగా తరలిపోతుందని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపద్యంలో జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందానికి నోడల్ అధికారిగా తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ సదా భార్గవిని నియమించారు. ఈ నేపద్యంలో ఆమె ఆదివారం నెల్లూరులోని గనుల శాఖ అదనపు డైరెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా ఎవరూ ఇసుకను రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాపై నవంబర్ 5వ తేదీ వరకూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అమె పేర్కొన్నారు. శనివారం నుండి చేపట్టిన డ్రైవ్ లో ఇప్పటి వరకూ మొత్తం 7 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. అందులో 5 టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు ఉన్నట్లు చెప్పారు. తడలో 3, వెంకటగిరిలో 2, గూడూరులో 1, కోటలో 1 వాహనాలను సీజ్ చేశామన్నారు. నెల్లూరు నుండి చైన్నైకు ఎక్కువగా ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ రవాణాలో భాగంగా బిల్లుల్లోని తేదీలను కూడా తారుమారు చేస్తున్నట్లు తాము గుర్తించామని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని సదా భార్గవి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!