November 12, 2019

ఇసుక కొరతపై సమరం – నెల్లూరులో టిడిపి నిరసన దీక్ష

Clock Of Nellore ( Nellore ) – ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా సామూహిక నిరాహార దీక్షలను చేపట్టింది. పార్టీ పిలుపు మేరకు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ మేయర్, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఉచితంగా లభించే ఇసుక నేడు బ్లాక్ మార్కెట్ లో లక్షల రూపాయలు పలుకుతుందని అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రభుత్వం ఆదేశించిన 24 గంటల్లోనే నెల్లూరులో 24 టిప్పర్లు పట్టుబడ్డాయని ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!