November 22, 2019

నెల్లూరు రూరల్ లో వైసీపి పటిష్ఠం – పలువుర్ని పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కార్యకర్తల బలంతోనే అది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో పలువుర్ని పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ స్థాయి ముఖ్య నేతలు బండి రమేష్, గుర్రాల నరసింహులు, బంగారయ్య, మురళీ నాయుడు తమ అనుచరులతో కలిసి వైసీపి కార్యాలయానికి తరలిరాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంంలో వైసీపి మరింత పటిష్ఠంగా మారిందని అన్నారు. పార్టీలోకి వస్తున్న వారికి తగిన గౌరవం, మంచి స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!