November 16, 2019

వైసీపిలో చేరిన చండి శంకరయ్య – ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత చండి శంకరయ్య యాదవ్ దొంతాలి గ్రామస్తులతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో మాతో ఉన్న ప్రతి ఒక్కరి ఋణం తీర్చుకుంటానని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి ఎంతోమంది నాయకులు వైసీపీలో చేరుతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరుతున్న వారికి సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!