November 21, 2019

ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీ కొట్టిన ట్యాంకర్ – ప్రయాణీకుడు మృతి

Clock Of Nellore ( Dagadarthi ) – నెల్లూరుజిల్లా దగదర్తి వద్ద బుధవారం తెల్లావారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి విజయవాడ వైపు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్తుండగా దగదర్తి సమీపంలోని లయన్స్ నగర్ ప్రాంతంలో రోడ్డు మరమ్మత్తు పనులను గుర్తించని డ్రైవర్ అటుగా బస్సును ముందుకు పోనివ్వగా అది అక్కడే కూరుకుపోయింది. ఆ బస్సులోని ప్రయాణీకులు మరో ట్రావెల్ బస్సు ఎక్కుతుండగా ఆ బస్సును వెనుక వైపు నుండి ట్యాంకర్ ఢీ కొట్టి పక్కనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణీకుడు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 5 మందిని గాయపడ్డారు. వారిని కావలి ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సైతో పాటూ బుచ్చి సిఐ సురేష్ బాబు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. జాతీయ రహదారి మరమ్మత్తు పనుల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోనందువల్లే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!