November 19, 2019

ఏపిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ ప్రారంభం – పోస్టర్ ఆవిష్కరణ, సేవా కార్యక్రమాల నిర్వహణ

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుతో నెల్లూరులో ఏపిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ ప్రారంభమైంది. నెల్లూరు నగరానికి చెందిన సయ్యద్ నిజాముద్ధీన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సేవా సంస్థ ప్రగతి ఛారిటీస్ లో పురుడుపోసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రారంభించిన ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్కడే చిన్నారులకు ఉచిత వైద్య శిభిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ కెఎస్ రాజు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతే కాకుండా ఏపిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కు సంభందించి అక్కడే విజయా డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పోస్టర్ ను ఆవిష్కరించి నిజాముద్దీన్ ను అభినందించారు. ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సేవా సంస్థ ప్రారంభమైందని రంగారెడ్డి ఈ సందర్బంగా తెలియజేశారు. సంస్థ నిర్వాహకులు సయ్యద్ నిజాముద్ధీన్ మాట్లాడుతూ ప్రార్ధించే పెదవుల కన్నా… సాయం చేసే చేతులే మిన్న అన్న మాటకు అర్ధం చెప్పేలా ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన పుట్టిన రోజు నాడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. అలాంటి మంచి మనిషికి ఎప్పుడూ మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో, ఆదాల సేవలు అన్నీ చోట్లా విస్తరించే విధంగా ఏపిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ను ప్రారంభించినట్లు తెలియజేశారు. ఇకపై ఈ సంస్ధ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని నిజాముద్దీన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆదాల మురళీ కృష్ణారెడ్డి, సంస్థ సభ్యులు పాముల హరిప్రసాద్, డాక్టర్ అజయ్ కుమార్, తాళ్లూరు అవినాష్, అబూబకర్, ఆదాల యువసేన అధ్యక్షులు మల్లి, జగదీష్, షరీఫ్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!