November 19, 2019

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం – సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటన

Clock Of Nellore ( Delhi ) – వివాద స్థలం హింధువులదేనని అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు స్పందించింది. సుప్రీం తీర్పుపై అంసతృప్తి ఉన్నా… గౌరవిస్తామని వెల్లడించింది. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించింది. 5 ఎకరాల కొత్త స్థలం వల్ల ఏం ఉపయోగమని అభిప్రాయపడింది. మరో వైపు దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా స్పందించింది. తమ కమిటి అంగీకరిస్తే తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలియజేసింది. అయితే ఈ కేసులో తుది తీర్పు వెలువడిన తర్వాత దానిపై రివ్యూ కోరేందుకు కోర్టు అంగీకరిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!