November 22, 2019

ఈనెల 15న నెల్లూరుజిల్లాలో విద్యా సంస్థల బంద్ – పిలుపునిచ్చిన విద్యార్ధి జేఏసి

Clock Of Nellore ( Nellore ) – ప్రశాంతమైన నెల్లూరుజిల్లాలో డ్రగ్స్ వాడకం అలవాటుగా మార్చిన దాన్ని నిరసిస్తూ ఈనెల 15వ తేదీనా విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్ధి జేఏసి ఛైర్మైన్ జి.వి. ప్రసాద్. నెల్లూరులోని ఓ కళాశాలకు చెందిన విద్యార్ధి ఇటీవల డ్రగ్స్ వాడుతూ, విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆ ఒక్క కళాశాలలోనే కాకుండా నెల్లూరులోని అనేక డిగ్రీ కళాశాలల్లో విద్యార్ధులు డ్రగ్స్ వాడుతున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులు పూర్తి స్థాయిలో పోలీసులు విచారించి దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మరియు డ్రగ్స్ ను వ్యతిరేకిస్తూ ఈ ఈ బంద్ కు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం ఎంత ప్రమాదకరమో విద్యార్ధులకు అవగాహన కల్పించడం మరియు దాని నిర్మూలనకు కళాశాలల యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైనా ఈనెల 15న బంద్ లో భాగంగా వివరిస్తామని జి.వి. ప్రసాద్ వెల్లడించారు. బంద్ లో భాగంగా జిల్లాలోని అన్నీ విద్యా సంస్థలను ఆ రోజు మూసివేసి తమకు సహకరించాలని లేదంటే తామే మూయిస్తామని తెలియజేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాగే ఈ బంద్ కు ప్రతీ ఒక్కరూ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అన్నీ విద్యార్ధి సంఘాలు కలిసి రావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!