January 23, 2020

అమ్మ ఒడితో నిరక్షరాస్యత దూరం – నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ కు పాలాభిషేకం

Clock Of Nellore ( Kovur ) – అమ్మ_ఒడి పధకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థినీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ స్కూల్ స్తాయి నుండి ఇంటర్మీడియట్ వరకూ విద్యార్థులను స్కూళ్ళు, కాలేజీలకు పంపే తల్లులకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున అందించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞలు తెలియజేస్తూ సోమవారం నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. స్థానిక వైసిపి నేత అహ్మద్ బాషా ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు వంశీ గౌడ్, యాటా అశోక్, నేతలు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!