November 19, 2019

ఇదే ట్రస్ట్ బోర్డు కూడా – రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటి ప్రమాణోత్సవంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు దర్గామిట్టలోని ప్రసిద్ధ గాంచిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 29వ తేదీ నుండి జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు సంభందించి నియమించిన ఉత్సవ కమిటి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలాగే అతిధులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ తదితరులు అతిధులుగా హాజరయ్యారు. ముందుగా ఆలయ ఈఓ ఉత్సవ కమిటి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి కమిటి సభ్యులను ముఖ్య అతిధులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి విజయం కోసం ఎంతో కష్టపడ్డ, దైవ చింతన కలిగిన వారిని సభ్యులుగా తీసుకున్నామని చెప్పారు. కష్ట కాలంలో తన వెంట ఉన్న ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తానని, వారి రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఉత్సవ కమిటిలో ఉన్నవారే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉంటారని అన్నారు. ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో విశిష్ఠత కలిగిన అమ్మవారి దేవస్థానంకు కమిటి ఏర్పడటం సంతోషమని అమ్మవారి సేవ చేసుకునే బాగ్యం కలగడం సభ్యుల అధృష్ఠమన్నారు. ఆనం విజయకుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. చివరగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 1975వ సంవత్సరంలో స్థాపించిన ఈ దేవస్థానానికి మొదటి సారిగా దసరా ఉత్సవ కమిటిని ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కిందని అన్నారు. కార్యక్రమం అనంతరం కమిటి సభ్యులను కోటంరెడ్డి సతీమణి సుజిత సత్కరించారు.

పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్వీటు తినిపిస్తున్న మంత్రి అనీల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!