November 16, 2019

సిఎం నెల్లూరు సభకు పటిష్ఠ భధ్రత – వివరాలు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్ధ కౌషల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో మంగళవారం జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా సభకు పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మరియు సభా వేదిక పోలీస్ ఇంఛార్జ్ సిద్ధార్ధ కౌషల్ తెలిపారు. సభా వేదిక వద్ద ఆయన సోమవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే పోలీసు సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. పోలీసు సిబ్బందితో అక్కడే సమావేశమయ్యి బందోబస్తు తదితర అంశాలను వారికి వివరించారు. అనంతరం సిద్ధార్ధ కౌషల్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 942 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు కేటాయించామని చెప్పారు. 14 విభాగాలుగా బందోబస్తును విభజించామన్నారు. హెలిప్యాడ్, పార్కింగ్, సభాస్థతి, ట్రాఫిక్ తదితర విభాగాల్లో పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సభకు హాజరయ్యే వారు ముందుగానే రావాలని, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!