November 12, 2019

ఇసుక అక్రమ రవాణాపై నెల్లూరు పోలీసుల ఉక్కుపాదం – సరిహద్దుల్లో నిరంతరాయ తనిఖీలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా కేంద్రంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టారు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. నూతన ఇసుక పాలసీ అమల్లోకొచ్చినప్పటి నుండి ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమంగా తరలిపోతున్న అనేక వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. తాజాగా ఎస్పీ జిల్లా సరిహద్దుల్లో నిరంతరాయ తనిఖీల కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులోని తడ, నెల్లూరు – చిత్తూరు సరిహద్దులోని పెళ్లకూరు, నెల్లూరు – కడప సరిహద్దులోని నెల్లూరు పాళెం ప్రాంతాల్లో ఆదివారం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ చెక్ పోస్టులో ఓ ఎస్సై స్థాయి అధికారితో పాటూ సిబ్బంది 24 గంటలూ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ నూతన ఇసుక పాలసీ అమల్లోకొచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇసుక అక్రమ రవాణాకు సంభందించి మొత్తం 75 భారీ వాహనాలను సీజ్ చేసి చర్యల నిమిత్తం ఆర్టీఓ, మైనింగ్ అధికారులకు అప్పగించామని చెప్పారు. అంతే కాకుండా డక్కిలి, వాకాడు, ఏఎస్ పేట, కొండాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రమినల్ కేసులు కూడా నమోదు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై జిల్లా వ్యాప్తంగా 33 కేసులు నమోదయ్యాయని 62 మంది అరెస్ట్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్ పై నిరంతరాయంగా నిఘా ఉంటుందని, అక్రమ రవాణాపై సమాచారం అందితే 9390777727 అనే వాట్స్ యాప్ నంబర్ కు వివరాలు పంపాలని లేదంటే, 94407 7963314 నంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని ఎస్పీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!