January 23, 2020

రేపటి నుండి అన్నీ పోలీస్ స్టేషన్లలో ” స్పందన ” – ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

Clock Of Nellore ( Nellore ) – సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించే దిశగా నెల్లూరుజిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అడుగులు ముందుకు వేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించిన విధంగా ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఇకపై స్పందన పేరుతో గ్రీవెన్స్ డే నిర్వహించాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతీ సోమవారం జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాల్లో, డిఎస్పీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ప్రజల నుండి అర్జీలు స్వీకరించాలని సూచించారు. అర్జీలు స్వీకరించి, ఎప్పటిలోగా పరిష్కరిస్తారో రశీదు కూడా ఇవ్వాలన్నారు. పోలీసు శాఖకు సంభందించి సమస్యలు ఉన్న ప్రజలు సంభందిత పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేయాలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!