November 22, 2019

దక్షిణ కోస్తాకు భారీ వర్షాల్లేవ్… బలహీన పడుతున్న అల్పపీడనం….

Clock Of Nellore ( Vizag ) – కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి బలహీన పడుతుంది. మంగళవారం ఉదయం ఏర్పడ్డ ఈ అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. బుధవారం ఉదయంకు అది వాయుగుండంగా మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే అది క్రమంగా బలహీన పడుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వాయుగుండంగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మరో వైపు ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా ఈశాన్యం వెంబడి… దక్షిణ కోస్తా తీరం వెంబడి నైరుతీ దిశగా గంటకు 45 నుండి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడుతాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!