November 22, 2019

పెన్నానదికి సోమశిల జలాలు – పొంగిపొర్లుతున్న వారధి – సందర్శకులతో బ్యారేజీ కిటకిట

Clock Of Nellore ( Nellore ) – సోమశిల జలాశయం నుండి పెన్నానదికి అధికారులు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం సోమశిల 11వ గేటు ను తెరిచి పెన్నాకు నీటిని విడుదల చేయగా, ఆదివారం మరో నాలుగు గేట్లు తెలిచారు. సోమవారం ఉదయం ఆ గేట్ల గుండా 20వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేసిన అధికారులు సాయంత్రానికి తగ్గించి 2,600 క్యూసెక్కుల మేరా నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు సోమవారం మధ్యాహ్నంకు నెల్లూరులోని పెన్నానదికి సోమశిల జలాలు చేరుకున్నారు. పెన్నా బ్యారేజీ ముందు అడ్డుగా ఉన్న మట్టి కట్ట వద్దకు భారీగా చేరుకున్న జలాలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మట్టికట్టను తెంచుకుని బ్యారేజీలోకి ప్రవేశించాయి. బ్యారేజీ పనులు ఇంకా కొనసాగుతుండటం, కొన్ని చోట్ల గేట్లు ఇంకా అమర్చకపోవడంతో వరద నీరు పెన్నా వారధి గుండా దిగువకు వెళ్తున్నాయి. మరో వైపు నగర వాసులు పెన్నా బ్యారేజీ వద్దకు చేరుకుని వరద నీటి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. అనేక మంది ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!