December 16, 2019

నెల్లూరులో పండితారాధ్యుల సాంబమూర్తి నూతన విగ్రహం – ఆవిష్కరించిన కుమారుడు ఎస్పీ బాలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరువాసి, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి నూతన విగ్రహాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంగళవారం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తండ్రి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శిల్పి రాజకుమార్ వడయార్ కు ఆత్మీయ సన్మానం చేశారు. గతంలో ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తన ఇంటి ఆవరణలో ప్రతిష్టించబోతున్నట్టు తెలిపారు బాలు. నెల్లూరులో తన తల్లిదండ్రులు నివసించిన ఇంటిని వేదపాఠశాల కోసం ఇస్తున్నట్టు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ వేదపాఠశాల నిర్వహిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!