November 16, 2019

వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు శనివారం పోస్టింగ్ ఉత్తర్వులు – కమీషనర్ మూర్తి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు సచివాలయ కార్యదర్శులుగా నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులను శనివారం అందజేస్తున్నట్లు కమిషనర్ పివివిఎస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. నగర పాలక సంస్థలో విధులు స్వీకరిస్తున్నందుకు వార్డు కార్యదర్శులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నగర పాలక సంస్థలో వార్డు వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రెటరీ, వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రెటరీ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులంతా శనివారం ఉదయం 9.30 నిముషాలకు కార్పొరేషన్ కార్యాలయంలో హాజరు కావాలని కమిషనర్ సూచించారు. హాజరయ్యే అభ్యర్థులు రేషన్/ ఆధార్ పత్రాలను ధ్రువీకరణ నిమిత్తం అందజేయాలని, విధుల్లో చేరే సమయంలో మెడికల్ ఫిట్నెస్, అటెస్టు చేసిన ధృవీకరణ పత్రాలు ఒక సెట్టు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!