November 21, 2019

సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే కాకాణి సమీక్ష – రైతు భరోసా, ఇళ్ల స్థలాల పంపిణీపై సూచనలు

Clock Of Nellore ( Podalakur ) – రైతు భరోసాకు సంభందించి వచ్చే నెల 15వ తేదీ లోగా రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు తహసీల్ధార్ కార్యాలయంలో ఆయన గురువారం సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా పథకం అర్హులైన రైతులందరికీ అందే విధంగా అధికారులు జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే పొదలకూరు మండలానికి సంభందించి ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి… రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు అందాలని అధికారులతో అన్నారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన రైతు భరోసా పథకాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే నెల 15వ తేదీ లోగా నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరికీ రైతు భరోసా నగదు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకు ఉచిత బోర్లు వేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా వైఎస్ఆర్ నేతన్న హస్తం పేరుతో చేనేతలకు ఏడాదికి 24వేలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం హర్షణీయమన్నారు. మత్స్యకారులకు అండగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వేట నిషేద సమయంలో 10వేల నగదు, డీజిల్ పై 9 రూపాయల సబ్సిడీని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. అన్నీ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పారదర్శకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!