December 16, 2019

కోటంరెడ్డి నా బావమరిది… మా మధ్యే విభేధాలు లేవు… స్పష్టం చేసిన కాకాణి

Clock Of Nellore ( Amaravathi ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేధాలు లేవని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో వైసీపి ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డితో జరిగిన జిల్లా సమన్వయ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు కోటంరెడ్డికి మధ్య వివాదాలు పుట్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి తనకు స్వయానా బావమరిది అని వివాదాలు ఉంటే ఇద్దరం కలిసి చర్చించుకుని పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం తమ మధ్య ఉందని అన్నారు. చిన్న తనం నుండే తాము స్నేహితులుగా ఉండేవారిమని గుర్తు చేశారు. పార్టీ కోసం జిల్లాలో అందరం కలిసి పనిచేస్తామని కాకాణి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!