December 16, 2019

ఈనెల 15న నెల్లూరులో సిఎం రైతు భరోసా సభ – వి.ఎస్.యు ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 15వ తేదీనా నెల్లూరులో రైతు భరోసా ప్రారంభ కార్యక్రమం జరగనుంది. నెల్లూరు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సభను మొదట ముత్తుకూరులో నిర్వహించాలని భావించినప్పటికీ అక్కడ స్థలం అనుకూలంగా లేదని చేల్చారు. దీంతో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వారం రోజులే ఉండటంతో ఏర్పాట్లు శరవేగంగా చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సభా వేదికకు సంభందించిన చిత్ర పటాన్ని కూడా పరిశీలించి ముఖ్యమంత్రి, ప్రజలు, ముఖ్యంగా రైతులు రాకపోకలపై దిశానిర్ధేశం చేశారు. వ్యవసాయం దాని అనుబంధ ప్రభుత్వ శాఖలకు సంభందించిన ప్రదర్శన శాలలు, యంత్ర పరికరాలు ముఖ్యమంత్రి, రైతులు తిలకించేందుకు వీలుగా తగినంత స్థలం కేటాయిస్తూ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ సచివాల నమూనా, నవ రత్నాల సమాచారం, వాహన మిత్ర, జలవనరుల శాఖకు సంభందించిన ప్రదర్శనశాలలు కూడా ఏర్పాటు చేయాలని ఆయా శాఖలకు కలెక్టర్ సూచనలు చేశారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సదుపాయం కల్పించాలని, రెండు చోట్ల హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ప్రజలకు సహకారం అందించాలని కలెక్టర్ వారికి వెల్లడించారు. పార్కింగ్ ప్రదేశాలు, వైద్య బృందాలు, బందోబస్తు ఏర్పాట్లు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డిఆర్డీఏ పిడి శీనానాయక్, నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవ రెడ్డి, వెంకటాచలం తహసీల్ధార్ సూర్యనారాయణ, సర్వేయర్ మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!