November 16, 2019

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత – మృతదేహంతో స్టేషన్ ముందు ధర్నా

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే ప్రాంతానికి చెందిన కామిరెడ్డి అనే వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. మనస్పర్ధల కారణంగా రెండేళ్ల నుండి దూరంగా ఉంటున్న భార్య… కామిరెడ్డిపై ఫిర్యాదు మేరకు కేసు విషయంపై మాట్లాడేందుకు పిలిపించగా… పోలీసులు తనను చితకబాదారని మనస్థాపం చెంది స్టేషన్ లోనే తలకు వేసుకునే రంగు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కామిరెడ్డిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ కామిరెడ్డి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన వారి బందువులు సోమవారం ఉదయం కామిరెడ్డి మృతదేహంతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. మృతికి కారణమైన ఎస్సైను, కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ అక్కడకు చేరుకుని వారితో చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకూ మృతదేహం స్టేషన్ ఎదుటే నడిరోడ్డుపై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!